close

ఆంధ్రప్రదేశ్

వస్తున్నాయ్‌.. ఓటరు చైతన్య రథాలు

లక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటరు చైతన్య రథాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని వివిధ కాలనీలతో పాటూ గ్రామాల్లో ఆయా రథాలు తిరగనున్నాయి. ఎల్‌ఈడీ తెరలు, మైకుల ఏర్పాటుతో పాటు ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించి ఆకట్టుకునేలా వివిధ చిత్రాలతో ఆయా వాహనాలను ముస్తాబు చేశారు. వీటిద్వారా ఓటుహక్కు విలువను తెలియజెప్పడంతో పాటు.. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం వీవీప్యాట్‌లలో సరిచూసుకునే విధానాన్నీ ఈ సందర్భంగా ఓటర్లకు వివరించనున్నారు. వివిధ హంగులతో సిద్ధంచేసిన ఈ చైతన్య రథాలు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో ఆదివారం ఇలా కనిపించాయి.

 -ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు