close

ఆంధ్రప్రదేశ్

ఓటు వేస్తే.. ఉచిత వైద్యం

దఫా ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు తీవ్ర కృషి చేస్తున్నారు. దీనిలోభాగంగా ఓటుహక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ఇప్పటికే విస్తృత ప్రచార కార్యక్రమాలకు తెరదీశారు. మరోవైపు, ఓటర్లలో స్ఫూర్తి రగిల్చేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రి యాజమాన్యం కూడా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 11వ తేదీన జరిగే పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించింది. ఓటు వేసినట్లు చేతిపై సిరాచుక్కపై చూపిన వారందరికీ అదేరోజు నుంచి ఏప్రిల్‌ 22 వరకు గుండె, మూత్రపిండాల పరీక్షలు, మహిళా ఓటర్లకు గైనిక్‌ పరీక్షలనూ పైసా వసూలుచేయకుండా నిర్వహించనున్నారు. ఓటుహక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు.. మెరుగైన సమాజం కోసం మెరుగైన వైద్యం పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. సమాచారం అందరికీ తెలిసేలా ఫ్లెక్సీలు, గోడపత్రికలతో ప్రచారం చేస్తోంది.  

- ఈనాడు, తిరుపతి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు