close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆత్మవిశ్వాసమే అవసరం

అందానికి ఎన్ని నిర్వచనాలైనా చెప్పొచ్చు. కానీ అందంగా లేమని కుంగిపోతోంటే మాత్రం లోపం మీలో ఉన్నట్లే. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకుని మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి. అదెలాగంటే...

* ముందు మీలో ఉన్న మీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి. బరువు, చర్మరంగు, ఎత్తు... వంటి వాటిని లెక్కలేస్తూ ఇతరులతో పోల్చుకోకండి. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిది. అలానే శారీరకంగా కంటే మానసికంగా బలంగా ఉండటమే అసలైన అందం.  మీలోని సుగుణాలు, మంచి అలవాట్లు, అభిరుచులను సానపెట్టుకోండి. అవి మీకో ప్రత్యేక గుర్తింపు తెస్తాయి.
* అద్దంలో చూసుకుంటున్నప్పుడు కళ్లు చిన్నగా ఉన్నాయనో, నవ్వు సరిగ్గా లేదనో కాకుండా... నలుగురిలోకి వెళ్లినప్పుడు ఒక వ్యక్తిగా మీరెలా కనిపిస్తారనేదీ గమనించుకోవాలి. దానివల్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. అలాగే చుట్టూ సానుకూలంగా మాట్లాడేవారు ఉండేలా చూసుకోవాలి.
* ఎంచుకునే దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీలు కూడా కొన్నిసార్లు సహజ అందాన్ని పెంచుతాయి.. లేదా తగ్గిస్తాయి. కాబట్టి ఏవి ఎంచుకుంటున్నా.. దుస్తుల రంగుల నుంచీ డిజైన్లూ.. ఇలా అన్నీ  మీకు నప్పుతాయా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నిర్ణయించుకోవాలి. ఏది వేసుకున్నా మీకు సౌకర్యంగా  అనిపించేలా చూసుకోవాలి. దీనివల్ల వచ్చే ఆత్మవిశ్వాసం అంతాఇంతా కాదు.


మరిన్ని