close

ఆంధ్రప్రదేశ్

3,91,81,399కు చేరిన ఓటర్లు

రెండున్నర నెలల్లో పెరుగుదల 22,48,308
పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
విశాఖ జిల్లాలో అత్యధికం, అత్యల్పంగా విజయనగరం
26న విడుదల చేసే తుది జాబితాలో మరింతగా పెరిగే అవకాశం
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ఈ నెల 22 నాటికి ఓటర్ల సంఖ్య 3,91,81,399కు చేరింది. గత రెండున్నర నెలల వ్యవధిలో 22,48,308 మంది ఓటర్లు పెరిగారు. ప్రత్యేక సమగ్ర సవరణ-2019కు సంబంధించి ఈ ఏడాది జనవరి 11న తుది జాబితా ప్రచురించే నాటికి 3,69,33,091 మంది ఓటర్లు ఉండగా..ఈ నెల 22 నాటికి 3,91,81,399కు చేరింది. 26న అనుబంధ జాబితా ప్రచురించే నాటికి అదనంగా మరో 4 లక్షల ఓటర్లు చేరే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 2.94 లక్షల మంది ఓటర్లు పెరగ్గా....విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 83,968 మంది మాత్రమే కొత్తగా చేరారు.

పెరుగుదల ఇలా!
* రెండు లక్షలకు పైగా పెరిగిన జిల్లాలు: విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కర్నూలు
* లక్షకు పైగా పెరిగిన జిల్లాలు: శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు
* రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,33,201 మంది అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, అనంతపురం మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం.
* తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా..ఆ తర్వాత స్థానాల్లో గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి
* విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప సంఖ్యలో ఓటర్లు ఉండగా..ఆ తర్వాత స్థానాల్లో శ్రీకాకుళం, కడప జిల్లాలు ఉన్నాయి.
* మొత్తం ఓటర్లలో 30%మంది తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోనే ఉన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు