close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫ్రెంచ్‌ మహిళల ఫ్యాషన్‌ సూత్రాలు!

ప్రపంచంలో ఫ్యాషన్‌ ఐకాన్లుగా ఫ్రెంచ్‌ మహిళల్నే చూపిస్తారు అంతా.  అందరినీ ఆకట్టుకునేలా వారెలాంటి ఫ్యాషన్‌ సూత్రాలు ఫాలో అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే..

* ఫ్రెంచ్‌ మహిళలు మార్కెట్‌లోకి వచ్చిన ప్రతిట్రెండ్‌నీ అనుసరించాలనుకోరు. వాళ్లకు నప్పేది మాత్రమే  ఎంచుకుంటారు. అందులోనూ సంప్రదాయ శైలికే ప్రథమ స్థానం.
* రంగులని ఎంచుకునేటప్పుడు ఎక్కువగా ఆఫ్‌వైట్‌, తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. మధ్యస్థంగా ఉన్న రంగుల దుస్తులు ఎంచుకుని స్కార్ఫ్‌, హ్యాండ్‌బ్యాగులు భిన్నంగా ఉండేలా చూసుకుంటారు. ఒకవేళ దుస్తులు ప్రకాశవంతంగా ఉన్నా... మిగిలిన యాక్సెసరీలు లేత రంగుల్లో ఉండేలా ఎంచుకుంటారు.
* ఫ్రెంచ్‌ మహిళలు అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తారంటారు. దానికి కారణం ఓ బ్లేజర్‌, సిల్కు స్కార్ఫ్‌ ఎప్పుడూ ఉండేలా చూసుకోవడమే. అలాగే తలనుంచి పాదం వరకూ  అన్నీ ఒకదానికొకటి మ్యాచింగ్‌ అవ్వాలనే నియమం వారికి లేదు.
* ఫ్రెంచ్‌ మహిళలు ఎంచుకునే లిప్‌స్టిక్‌ ఎప్పుడూ ఎరుపు రంగుదే అయ్యుంటుంది. అందులోనే ఛాయలు మారుతాయి తప్ప మిగిలిన రంగులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు.
* యాక్సెసరీలు అతిగా లేకుండా చూసుకుంటారు. ఒకవేళ మరీ పొడవాటి ఇయర్‌రింగ్స్‌ ఎంచుకుంటుంటే... నెక్లెస్‌ వేసుకోరు. పెద్ద నెక్లెస్‌ వేసుకుంటే ఇయర్‌రింగ్స్‌కి ప్రాధాన్యం ఇవ్వరు. వెండి, బంగారు రంగుల్ని కలిపి ఎంచుకోరు. ఎంత తక్కువ నగలు వేసుకుంటే అంత ఆకట్టుకునేలా కనిపిస్తామని వారు భావిస్తారు.
* ఫ్రెంచ్‌ అమ్మాయిలు తమ శరీరానికి సరిగ్గా నప్పే దుస్తులను మాత్రమే ఎంచుకుంటారు. మరీ బిగుతుగా, అలాగని మరీ వదులుగా ఉండేవి కాకుండా చూసుకుంటారు. సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తారు.
* మరీ ఎత్తుమడమల చెప్పులు కాకుండా... బ్యాలెరినా వంటి రకాల్నే ఎక్కువగా వేసుకుంటారు. వాళ్ల నడకలోనూ ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలని కోరుకుంటారు. అందుకే నిటారుగా, ఆత్మవిశ్వాసంతో నడుస్తారు.


మరిన్ని