close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫ్రూట్‌ రైతా

అమ్మ చేత కమ్మగా

కావల్సినవి: యాపిల్‌, పైనాపిల్‌, అరటిపండు ముక్కలు - అన్నీ కలిపి ఒకటిన్నర కప్పు, దానిమ్మ గింజలు - రెండు పెద్ద చెంచాలు, చిక్కని, తాజా పెరుగు - రెండు కప్పులు, మిరియాలపొడి - పావు చెంచా, జీలకర్రపొడి  - అర చెంచా, చక్కెర- పెద్ద చెంచా, ఉప్పు - కొద్దిగా.
తయారీ: పెరుగును ఓ గిన్నెలో తీసుకుని ఉప్పు, చక్కెర,   మిరియాలపొడి, జీలకర్రపొడి వేసుకుని గిలకొట్టినట్లుగా కలపాలి. ఇలా చేయడం వల్ల పెరుగు క్రీంలా మారుతుంది. అందులో పండ్లముక్కలన్నీ వేసి మరోసారి కలిపి ఓ అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. మధ్యాహ్నం పూట పిల్లలకు పెడితే చాలా మంచిది.


మరిన్ని