close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పిల్లలకు పశ్చిమోత్తానాసనం

చాలామంది పిల్లలు పొడవు పెరగాలని తాపత్రయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా చిన్నారుల ఎత్తు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొన్ని యోగాసనాల ద్వారా సహజంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఎత్తు పెరగొచ్చు. అందుకోసం పశ్చిమోత్తానాసనం సరైన పరిష్కారం. దాన్ని ఎలా వేయాలంటే...

చేసే విధానం
యోగా మ్యాట్‌పై రెండు కాళ్లను ముందుకు చాపి వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. కాళ్లు పూర్తిగా నేలకు ఆనించాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులను తలకు సమాంతరంగా పైకి లేపాలి. శ్వాసను వదులుతూ నడుమును వీలైనంత ముందుకు వంచుతూ చేతులను పాదాల దగ్గరకు తెచ్చి... అరిపాదాలను పట్టుకునే ప్రయత్నం చేయాలి. తలను మోకాళ్లకు ఆనించాలి. ఈ ఆసనంలో పది నుంచి ఇరవై సెకన్ల వరకు ఉండొచ్చు. ఆ తరువాత నెమ్మదిగా చేతులను విడదీసి పూర్వపు స్థితికి రావాలి.

జాగ్రత్తలు
ఇది కొంచెం కష్టమైన ఆసనం. అయితే ఒకేసారి బలవంతంగా చేయకూడదు. గుండె పోటు, రక్తపోటు, నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.
లాభాలు
ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట, నడుము ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి సాగే గుణం వస్తుంది. పైల్స్‌, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది.

మరిన్ని