close

ఆంధ్రప్రదేశ్

నివేదిక తర్వాతే నిర్ణయం

ఓటింగ్‌ సరళిపై నేడు సమీక్ష
ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల నిర్వహణపై అక్కడి పరిశీలకులు నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి ఏం  చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో జరిగిన ఓటింగ్‌ సరళిపై శుక్రవారం సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించామని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయపార్టీలు పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పొచ్చని, వారు చెప్పిన వివరాల ఆధారంగా మొత్తం ఈవీఎంలను సమీక్షిస్తామని చెప్పారు. ఏపీలో 2014లో  74.64% పోలింగ్‌ నమోదైతే, గురువారంనాడు సాయంత్రం 6 గంటల వరకు 66% నమోదైందని, ఆ సమయానికి ఇంకా చాలా చోట్ల ఓటర్లు క్యూలో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల సమస్య పెద్దగా రాలేదని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఎన్నికలో కేవలం 0.98% బ్యాలెట్‌యూనిట్లు, 1.04% కంట్రోల్‌ యూనిట్లు, 1.61% వీవీప్యాట్లు మాత్రమే మార్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం కమిషన్‌ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయన కమిషన్‌తోకూడా మాట్లాడారని, కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంకారణంగా పోలింగ్‌ ప్రారంభంకావడానికి జాప్యం జరిగినందున మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన కోరినట్లు చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు