close

ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌కు దూరంగా 1,500 మంది ఓటర్లు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మన్యంలో బుంగాపుట్టు, కొసొంపుట్టు గ్రామాలకు చెందిన పోలింగ్‌ కేంద్రాలను బాబుసాల పంచాయతీ మచ్చెపురం కేంద్రంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సుమారు 1500 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఓటు వేసేందుకు 20 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉందని, బుంగాపుట్టులో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఐటీడీఏ అధికారులు వారి కోసం ప్రత్యేకంగా 8 వాహనాలను పంపినా వాటిని వెనక్కు పంపేశారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది వెళ్లి బతిమలాడినా పట్టువీడలేదు. శుక్రవారం పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే ఓటేస్తామంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. బూసీపుట్టు, సరియాపల్లి, కెందుగుడ గ్రామాల ఓటర్లకు మద్దులబందలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. వారంతా మావోయిస్టుల హెచ్చరికలతో ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు.

* చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని చెన్నవారిపాలెం, నగరి మండలం, రాజీవ్‌నగర్‌ గ్రామస్థులు, రేణిగుంట మండలం గాజులమండ్యం శివారు నల్లపాలెం గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. నాయకులు వెళ్లి చెప్పినా... తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వేయమని మొండికేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు