close

ఆంధ్రప్రదేశ్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.45 లక్షల మంది

అర్హత పొందే విద్యార్థుల సంఖ్యను  ప్రకటించిన ఐఐటీ రూర్కీ
మే 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ
ఈనాడు - హైదరాబాద్‌

ఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈసారి మొత్తం 2.45 లక్షల మందికి అవకాశం కల్పించనున్నారు. అంతమంది పరీక్ష రాసేందుకు అర్హత కల్పించేలా జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. ఐఐటీ రూర్కీ గురువారం ఈ మేరకు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 27న అడ్వాన్స్డ్‌ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన వారు మాత్రమే అడ్వాన్స్డ్‌ పరీక్ష రాయడానికి వీలవుతుంది. గత ఏడాది మొత్తం 2.24 లక్షల మందికి అడ్వాన్స్డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తామని ముందుగా ప్రకటించారు. ఒకవేళ జేఈఈ మెయిన్‌లో ఒకే ర్యాంకు ఇద్దరికి వస్తే అర్హత సాధించేవారి సంఖ్య 2.45 లక్షల కంటే పెరుగుతుంది.

మే 3 నుంచి దరఖాస్తులు
జేఈఈ మెయిన్‌ రెండోసారి పరీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఫలితాలను ఏప్రిల్‌ 30న ప్రకటిస్తామని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించినా అంతకంటే కనీసం వారం రోజులు ముందుగా రావొచ్చని భావిస్తున్నారు. ఈక్రమంలో జేఈఈ మెయిన్‌లో అర్హత మార్కులు సాధించిన వారు జేఈఈఅడ్వాన్స్డ్‌కు మే 3 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు
ఏపీ: అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు