close

ఆంధ్రప్రదేశ్

తెదేపా దాడులు, దౌర్జన్యాలు

ఓటమి భయంతోనే..
  ఎన్నికల అధికారికి వైకాపా ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ సందర్భంగా తెదేపా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  దౌర్జన్యాలకు, బూత్‌ల ఆక్రమణలకు, తమ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడిందని వైకాపా ఆరోపించింది. ఈ మేరకు వైకాపా వైకాపా ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ ఎన్నికల నిఘావిభాగం కమిటీ సభ్యుడు గౌతంరెడ్డి  గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 2018లో తెదేపా నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌లలో భద్రతా సిబ్బందిని నామమాత్రంగా నియమించారని, కొన్నిచోట్ల అంగన్‌వాడీ సిబ్బందిని పోలింగ్‌ ఉద్యోగులుగా నియమించడం వల్ల పోలింగ్‌ నెమ్మదించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు