close

ఆంధ్రప్రదేశ్

ఏ మీట నొక్కినా భాజపాకు ఓట్లు!

కుప్పంలో మాక్‌ పోలింగ్‌లో గుర్తింపు
ఇతర పార్టీల ఏజెంట్ల ఆరోపణ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం పట్టణం పాతపేటలోని 174 నంబరు పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించగా ఏ గుర్తుపై మీట నొక్కినా భాజపా గుర్తు కమలానికే ఓటు పడిందని ఇతర పార్టీల ఏజెంట్లు ఆరోపించారు. ఇతర పక్షాలకు చెందిన గుర్తులపై నాలుగు సార్లు నొక్కగా భాజపా గుర్తు కమలంపై ఓటు నమోదైందని వారు పేర్కొన్నారు. ఉదయం 5.30 నుంచి 7.00 గంటల వరకు జరిగిన మాక్‌ పోలింగ్‌లో ఇలా జరిగిందని, తర్వాత సాంకేతిక సిబ్బంది ఈవీఎంను సరిచేసి పోలింగ్‌ నిర్వహించినట్లు ఏజెంట్లు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు