close

ఆంధ్రప్రదేశ్

మాకు 70.. మీకు 30

‘ప్రజల ఓట్లతో మాకేమి సంబంధం.. గ్రామంలో మాదే ఆధిక్యం. మాకు 70 శాతం, మీకు 30 శాతం ఓట్లు పంచుకుందాం. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయ’ని స్థానిక వైకాపా నేతలు తెదేపా కార్యకర్తలను బెదిరించారు. భయపడిన తెదేపా కార్యకర్తలు ఒప్పందానికి సరేనన్నారు. దీంతో నాయకులందరూ పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటర్లందరినీ ఇంటికి పొమ్మన్నారు. ఆపై పోలింగ్‌ కేంద్రం తలుపులు మూసేశారు. ఈ ఘటన కడప జిల్లా కాశినాయన మండలం గొంటువారిపల్లెలో చోటుచేసుకుంది. ఇదే సందర్భంలో కొందరు ఓటర్లు ‘మేం బెంగళూరు నుంచి ఓటు వేయడానికి వచ్చాం, మేము ఎందుకు ఓటు వేయకూడదు.. అని నాయకులను ప్రశ్నించారు. ఈమేరకు వారు వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లలో తమ ఆవేదనను వెలిబుచ్చారు. దీనిపై ఈనాడు, ఈటీవీ వార్త ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. అల్లరి మూకలను చెదరగొట్టారు. పోలింగ్‌ కొద్దిసేపు సజావుగా జరిగింది. తెదేపా కార్యకర్తలు ప్రలోభాలకు లొంగకపోవడంతో మూడు గంటల సమయంలో భౌతిక దాడులకు దిగారు.

-న్యూస్‌టుడే, కాశినాయన


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు