close

ఆంధ్రప్రదేశ్

అర్ధరాత్రి వరకూ పోలింగ్‌

12.30 తర్వాత 14 కేంద్రాల్లో..  సాయంత్రం ఆరుగంటలకు 71.43 శాతం నమోదు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం అర్ధరాత్రి దాటినంత వరకూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఒకే ఎన్నిక రెండు క్యాలెండర్‌ తేదీల్లో (అర్ధరాత్రి దాటటంతో) జరగటం కూడా ఇదే మొదటిసారి. రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్‌ నిర్వహించారు. 12.30 తర్వాత 14 కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 71.43 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు గంటల తర్వాత పోలింగ్‌ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదైందనే గణాంకాలను మాత్రం వెల్లడించలేదు. వివరాలు తెలపకుండానే ఎన్నికల అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అర్థరాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగిన నేపథ్యం, అప్పటికే క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 80 శాతం పైబడి పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాత్రి 11.30 గంటల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ శాతాలను పరిగణనలోకి తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 74.21 శాతం పోలింగ్‌ నమోదైంది. కర్నూలులో అత్యల్పంగా 63 శాతం పోలింగ్‌ నమోదైంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు