close

ఆంధ్రప్రదేశ్

‘జనాభా పెరుగుదల’లో మనమే ఫస్ట్‌

2010-19లో భారత్‌ వార్షిక  సగటు వృద్ధి 1.2శాతం
136 కోట్లకు చేరిన దేశ ప్రజలు
ఐరాస జనాభా నిధి నివేదిక

ఐరాస: మనదేశంలో 2010 నుంచి 2019 మధ్య జనాభా వార్షిక సగటు 1.2శాతంగా ఉన్నట్లు ‘‘ఐక్యరాజ్యసమితి (ఐరాస) జనాభా నిధి -యూఎన్‌పీఎఫ్‌’’ నివేదిక తెలిపింది. ఇదేకాలంలో చైనాలో పెరుగుదల 0.5శాతం మాత్రమే. అంటే మనదేశం జనాభా పెరుగుదల రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 142 కోట్ల జనాభాతో చైనా ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉండగా, 136 కోట్ల మందితో ద్వితీయస్థానంలో నిలిచాం. 1969లో 54.15 కోట్లుగా ఉన్న మనదేశ జనాభా, 1994నాటికి 94.22 కోట్లుకు చేరింది. ఇదేకాలంలో చైనా జనాభా 80.36 కోట్ల నుంచి 123 కోట్లకు పెరిగింది. ‘ప్రపంచ జనాభా పరిస్థితి 2019’ పేరిట ‘యూఎన్‌పీఎఫ్‌’ విడుదల చేసిన నివేదిక ప్రకారం...

మనదేశంలో పరిస్థితి ఇదీ...
* భారత్‌లో 0-14, 10-24 ఏళ్ల వయస్కులు 27శాతం మంది ఉండగా.. 15-64 వయస్కులు 67శాతం మంది; 65 ఏళ్లు అంతకు మించి పైబడినవారు ఆరు శాతం ఉన్నారు.

* 1994లో ప్రతి లక్ష మందికి ‘తల్లి మరణాల నిష్పత్తి’ 488 ఉండగా, 2015నాటికి 174కు తగ్గింది.

మొదటిసారి మహిళలకు సంబంధించి మూడు కీలకాంశాల సమాచారం
* నివేదికలో మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించిన మూడు కీలకాంశాలపై సమాచారం పొందుపరిచారు. అవి... ఆరోగ్య సంరక్షణ, జీవితభాగస్వామితో లైంగిక సంపర్కô, గర్భనిరోధక మాత్రల, ఇంజెక్షన్ల వాడకం.

* రోజూ ప్రపంచవ్యాప్తంగా 500 మంది బాలికలు, మహిళలు గర్భధారణ, ప్రసవాల సమయంలో మృత్యువాత పడుతున్నారు. సరైన ఆరోగ్య సేవలు అందకపోవడం, అత్యవసరం సమయంలో ఆదుకోవడానికి తక్షణ వైద్యసేవలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం.

* మహిళా సాధికారతకు ప్రధాన అడ్డంకి, పునరుత్పత్తి హక్కులు పొందలేకపోవడానికి ముఖ్య కారణం బాల్య వివాహాలే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు