close

ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుక్కి ఓటేయాలని..!

ఈ పండుటాకు పేరు గోదావరి సూరమ్మ. విశాఖ నగర శివారు మధురవాడలోని వాంబేకాలనీ డీ బ్లాకులో ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది. వయసు 80 ఏళ్లు. ఊతకర్ర తోడు లేనిదో బయటకు రాలేదు. ఈమె ఇంటికి పోలింగ్‌ కేంద్రం 5 కిలోమీటర్ల దూరంలో (మధురవాడలోని చంద్రంపాలెం) ఉంది. నడవలేకపోయినా, ఓటు వేసే శక్తి లేకపోయినా తన పెద్దకొడుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు తెలపాలన్న సంకల్పంతో శక్తినంతటినీ కూడదీసుకుని గురువారం మండుటెండలో బయల్దేరింది. ఇంతలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి సాయంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకొని ఓటు వేసింది. తిరిగి ఇంటికి వెళుతున్న సందర్భంగా ఆమె తన బాధను అక్కడివారితో పంచుకుంది. తనకెవరూ లేరని, సీఎం చంద్రబాబే పెద్దకొడుకని కన్నీరుమున్నీరైంది. ఆయన ఇస్తున్న ఇస్తున్న పింఛనుతోనే బతుకుతున్నానని.. ఆయన పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో పోలింగ్‌ కేంద్రానికి ఎండలో వచ్చినట్టు వివరించింది.

- ఈనాడు, విశాఖపట్నం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు