close

ఆంధ్రప్రదేశ్

పట్టువదలని ‘విక్రమార్కురాలు’

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన పోలాకి రాజలక్ష్మి గురువారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లగా  జాబితాలో పేరు లేదని కేంద్రం నుంచి పంపించేశారు. ఇంటికి వెళ్లిన రాజలక్ష్మి ఓటరు కార్డు నంబరు ఆధారంగా అంతర్జాలంలో శోధించగా ఓటు ఉన్నట్లు తేలింది. దీంతో మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఆ యువతి అధికారులను ప్రశ్నించారు. అయితే మా వద్ద ఉన్న జాబితాలో పేరు లేదని అధికారులు సమాధానమిచ్చారు. అక్కడ ఉన్న పోలింగ్‌ ఏజెంట్‌ను సంప్రదించగా జాబితా(అడిషన్‌)లో 1127 క్రమ సంఖ్యతో రాజలక్ష్మికి ఓటు ఉన్నట్లు తేలింది. మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆమెకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. పట్టువదలకుండా పోరాడిన ఆ యువతి చివరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు