close

ఆంధ్రప్రదేశ్

మహిళా విద్యకు తోడ్పడిన జ్యోతిబా పూలే

ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో మహిళా విద్యకు, అభ్యున్నతికి తొలిసారిగా మహాత్మా జ్యోతిబా పూలే పునాది వేశారని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, తెలంగాణ భవన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పూలే జయంతిని భవన్‌ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ ప్రకాశ్‌, తెలంగాణ భవన్‌ డిప్యూటీ కమిషనర్‌ జి.రామ్మోహన్‌.. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ పూలే తన సతీమణి సావిత్రిబాయికి తొలుత విద్యను నేర్పించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. తెలంగాణ భవన్‌ డీసీ రామ్మోహన్‌ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో భవన్‌ల అధికారులు లింగరాజు, సాయిబాబు, వెంకట రమణ, ఎం.వి.ఎస్‌.రామారావు, రామకోటయ్య సంగీత తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు