close

ఆంధ్రప్రదేశ్

రికార్డు స్థాయిలో రైలు ప్రయాణం

ఒక్క రోజులో 1.24 లక్షల మంది

ఈనాడు-హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో గురువారం జరిగిన ఎన్నికలకు జంటనగరాల నుంచి రైళ్లలో లక్షల మంది ప్రయాణికులు తరలివెళ్లారు. ఈనెల 10న ప్రధాన స్టేషన్లు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి ప్రయాణికులతో పోటెత్తాయి. ఒక్క సికింద్రాబాద్‌ నుంచే 1.24 లక్షల మంది ప్రయాణికులు వెళ్లారు. ఇందులో 96 వేల మంది జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు, 28 వేల మంది రిజర్వేషన్‌ తీసుకున్నవాళ్లు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక రికార్డని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు నిత్యం 532 బస్సులు నడుపుతుంది. వీటికి అదనంగా బుధవారం 355 ప్రత్యేక బస్సులు వేసినా ఓట్లేసేందుకు వెళ్లేవారికి ఏమాత్రం చాలేదు. టీఎస్‌ఆర్టీసీ ఏపీ వైపు 250 వరకు బస్సులు నడుపుతుంది. రద్దీని దృష్టిలోపెట్టుకుని 400 వరకు ప్రత్యేకబస్సులు ఏపీకి నడిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు