close

ఆంధ్రప్రదేశ్

మై ఓట్‌ క్యూ.. యాప్‌ విఫలం

సమాచారమే అందుబాటులో లేదంటూ విమర్శలు

ఈనాడు, అమరావతి: ఇది యాప్‌ల కాలం. ఎన్నికల సంఘం (ఈసీ) కూడా పోలింగు ప్రక్రియలో ఓటర్ల సౌలభ్యానికి కొన్ని యాప్‌లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో ఒకటైన ‘మై ఓట్‌ క్యూ యాప్‌’ పూర్తిగా విఫలమయిందనే విమర్శలు వచ్చాయి. సాధారణంగా ఓటర్లు పోలింగు కేంద్రం ఖాళీగా ఉన్నప్పుడే వెళ్లి ఓటువేసి వచ్చేద్దామనుకుంటారు. ఈ నేపథ్యంలో ఓటరు ఆలోచనలకు అనుగుణంగా ఏ పోలింగు కేంద్రంలో ఎప్పుడు ఓటర్ల క్యూ ఎలా ఉందో తెలియజేసేలా ఒక యాప్‌ సిద్ధం చేసినట్లు ఈసీ ప్రకటించింది. దాన్ని వినియోగిస్తూ ఏ పోలింగు కేంద్రం సమాచారమైనా తెలుసుకోవచ్చని, ఖాళీగా ఉన్న సమయాన్ని గుర్తించి ఓటు వేయవచ్చని సెలవిచ్చింది.. ప్రతి 5 నిముషాలకు ఇందులో సమాచారాన్ని నవీకరిస్తామని, తాజా పరిస్థితులు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిజానికి.. అసలు ఇలాంటి సమాచారం ఏదీ ఆ యాప్‌లో పొందుపరచలేదు. ఈ యాప్‌ వినియోగించిన ఓటర్లకు ఎప్పుడు చూసినా ‘నో క్యూ యాడెడ్‌ ఎట్‌’ (ఆ సమాచారం ఏదీ ఇందులో పొందుపరచలేదు) అన్న సమాధానమే కనిపించింది. ఎన్నికల సంఘం సమాచారాన్ని నవీకరించిన దాఖలాలు కనిపించలేవు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు