close

ఆంధ్రప్రదేశ్

అధికారంలోకి వస్తాం

వైకాపా అధినేత జగన్‌ ధీమా

పులివెందుల, న్యూస్‌టుడే: దేవుని దయ ఉందని.. తప్పకుండా వైకాపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందులలోని 134వ పోలింగ్‌ కేంద్రంలో గురువారం ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పారు. జగన్‌ సతీమణి భారతీరెడ్డి, తల్లి విజయమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు