close

ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీసమేతంగా హిందూపురంలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు తమ స్వగ్రామాలైన ఏవీ నగరం, నర్సీపట్నంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మడకశిరలో, పరిటాల సునీత కుటుంబసభ్యులతో కలిసి వెంకటాపురంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 

 

 

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు