close

ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ నిర్వహణలో విఫలం

ప్రధాన కార్యదర్శిని నిలదీసిన ఓటర్లు

విజయవాడ, న్యూస్‌టుడే: ఓటు హక్కు వినియోగించుకోండని ఊదరగొట్టిన ఎన్నికల సంఘం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీ సవ్యంగా సాగలేదని, గుర్తింపు కార్డు తీసుకొచ్చినా స్లిప్పులు లేవని పంపేయడం ఎంతవరకు సబబని.. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను మహిళలు, వృద్ధులు నిలదీశారు. తాగునీటి సౌకర్యలేమి, ఎండ ఉన్నా షామియానాలు ఏర్పాటు చేయకపోవడం, స్లిప్పుల పంపిణీలో అలసత్వం తదితర అంశాలపై ఆయనను ప్రశ్నించారు. దీంతో సుబ్రహ్మణ్యం.. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పి వెళ్లి పోయారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు