బ్రేకింగ్

breaking
18 Jan 2022 | 09:46 IST

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. కొద్ది సేపటికే అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:40గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115.18 పాయింట్లు నష్టపోయి 61,193.73 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41.00 పాయింట్ల నష్టంతో 18,267.10 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.38గా ఉంది. సన్‌ఫార్మా, టెక్‌మహీంద్రా, టైటాన్‌, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్ బ్యాంక్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్‌ఎం, ఇన్ఫీ, మారుతీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు