బ్రేకింగ్

breaking
21 Jan 2022 | 09:49 IST

నష్టాల్లో మార్కెట్లు.. 18వేల దిగువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:44గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 476.93 పాయింట్లు నష్టపోయి 58,987.69 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 135.05 పాయింట్ల నష్టంతో 17,621.95 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.51గా ఉంది. పవర్‌గ్రిడ్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటాస్టీల్‌, మారుతీ, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని