బ్రేకింగ్

breaking
21 Jan 2022 | 18:44 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్‌: తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.  కరోనా తీవ్రత తగ్గితే సినిమాను మార్చి 18న విడుదల చేయడానికి యోచిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఒకవేళ అప్పటికీ వీలుకాకపోతే ఏప్రిల్‌ 28న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కాగా.. జనవరి 7న విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు