బ్రేకింగ్

breaking
22 Jan 2022 | 13:41 IST

CM సహకారంతోనే క్యాసినో జరిగిందా?: ధూళిపాళ్ల

మంగళగిరి: కొడాలి కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారని ఓ వీడియోను తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పందననూ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ‘‘క్యాసినో జరగలేదని కొడాలి నాని బుకాయించారు. నేను బయటపెట్టిన ఆధారాలపై కొడాలి సమాధానం చెప్పాలి. బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం మౌనం దేనికి సంకేతం? సీఎం, డీజీపీ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోంది. ఇంతవరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదు. జగన్‌ సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా? జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా?’’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు