బ్రేకింగ్

breaking
23 Jan 2022 | 10:33 IST

AP: జనవరి నుంచే కొత్త పే స్కేళ్లతో జీతాలు.. 

అమరావతి: కొత్త పేస్కేళ్లతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లులు తయారీకి ఆదేశించింది. ఈమేరకు డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఆదేశాలు ఇచ్చారు. ‘‘ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌ను అనుసరించి బిల్లుల చెల్లించాలి. 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31వరకు సర్వీస్‌ గణించాలి. కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి. ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేసి.. డీడీవోలకు కొత్త పే రూల్స్‌ అందుబాటులో ఉంచాలి’’ అని అధికారులకు సూచించారు.

మరిన్ని

తాజా వార్తలు