బ్రేకింగ్

breaking
25 Jan 2022 | 12:28 IST

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: TS హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ‘‘ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోంది. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనం’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనికి  ఏజీ ప్రసాద్‌ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని ఈసందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్‌ హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు