బ్రేకింగ్

breaking

ప్రధాని వ్యాఖ్యలపై నిరసనలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

[21:26]

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ మళ్లీ తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారు.. దశాబ్దాల పోరాటం, ప్రాణత్యాగాలను కించపరిచారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై రేపు తెరాస పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భాజపా పార్టీ దిష్టి బొమ్మల దహనం చేసి, నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలన్నారు. 

మరిన్ని

తాజా వార్తలు