బ్రేకింగ్

breaking

వారంలో ‘పోలీస్’ నోటిఫికేషన్‌: హరీశ్‌రావు

[14:10]

సంగారెడ్డి: తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో పోలీసు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘వారంలో పోలీస్‌ నోటిఫికేషన్‌.. సిద్ధంగా ఉండండి. కేంద్రంలోని భాజపా 15లక్షలకుపైగా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తుంది? దీనిపై బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ధరల పెంపుతో ప్రజలను ఆగం చేస్తున్నందుకు సంజయ్‌ యాత్ర చేస్తున్నారా? కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భాజపా లబ్ధిపొందాలని చూస్తోంది. ఉద్యోగాల భర్తీ గురించి భాజపాను ఎక్కడికక్కడ నిలదీయాలి’’ అని హరీశ్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు