బ్రేకింగ్

breaking

‘శేఖర్‌’ నిర్మాతలు వాళ్లు కాదు: సుధాకర్‌ రెడ్డి

[12:33]

హైదరాబాద్‌: ‘శేఖర్‌’ సినిమాను ఆపేసి అన్యాయం చేశారని ఆ చిత్ర నిర్మాత సుధాకర్‌ రెడ్డి వాపోయారు. ‘‘శేఖర్‌ సినిమాను నిర్మించింది నేనే. సినిమాలో శివానీ, శివాత్మికల పేరు మాత్రమే ఉన్నాయి. ఆ సినిమాకు వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్‌ ప్రొవైడర్స్‌ ఆపేయడం వల్లే సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్‌ ప్రొవైడర్లుకు డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను. వారే ఈ సినిమాను చంపేశారు. కోర్టు తీర్పు వచ్చాక పరంధామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాను. నాకు కలిగిన నష్టాన్ని పరంధామరెడ్డి ఇస్తారా? డిజిటల్‌ ప్రొవైడర్లు ఇస్తారా?’’ అని సుధాకర్‌ ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు