బ్రేకింగ్

breaking

AP: సుబ్రహ్మణ్యం హత్య.. కథ వేరే ఉంది!

[13:53]

కాకినాడ: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ కారు డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్‌ ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన అపార్టుమెంట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో.. ఈనెల 19 రాత్రి 10:30 సమయంలో అపార్టుమెంట్‌ వద్ద గొడవ జరగలేదు. రాత్రి 12గంటలకు అనంత బాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ ఒంటిగంటకు వెళ్లిపోయినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. కాగా గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడం వల్లే చనిపోయాడని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఎస్పీ చెప్పినట్టు అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు