బ్రేకింగ్

breaking
26 Jun 2022 | 20:20 IST

‘పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికే భారత్‌ ఆదర్శం’

జర్మనీ: భారత ప్రజాస్వామ్య చరిత్రలో జూన్‌ 25 ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారతీయులకు ప్రజాస్వామ్యం గర్వకారణమన్న మోదీ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదన్నారు. ఈ మేరకు జర్మనీలోని మ్యూనిక్‌లో ఎన్‌ఆర్‌ఐల సదస్సులో ఆయన ప్రసంగించారు. పారిశ్రామిక విప్లవంతో గత శతాబ్దంలో జర్మనీ, ఇతర దేశాలకు లబ్ధి చేకూరిందన్నారు. బ్రిటీష్‌ పాలన వల్ల పారిశ్రామిక విప్లవ ఫలితాన్ని భారత్‌ పొందలేకపోయిందన్నారు. పారిశ్రామిక విప్లవంలో భారత్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

మరిన్ని

తాజా వార్తలు