బ్రేకింగ్

breaking
27 Jun 2022 | 13:24 IST

₹2వేలు వసూలు చేస్తే విమర్శిస్తారా?: జగన్‌

శ్రీకాకుళం: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం. పిల్లలను చదివిస్తే చాలు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశాం. పాఠశాలలు, టాయిటెట్‌ మెయింటెనెన్స్‌ కింద ₹2వేలు వసూలు చేస్తున్నాం.. దానికే విమర్శిస్తారా?’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని

తాజా వార్తలు