బ్రేకింగ్

breaking

తెలంగాణలో మార్పు కనిపిస్తోంది: పీయూష్‌

[15:41]

హైదరాబాద్‌: కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ప్రకటనపై చర్చ సందర్భంగా స్థానిక నేత డీకే అరుణ ఇక్కడి పరిస్థితులను వివరించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపా సత్తా చాటిందన్నారు. తెలంగాణలోని కుటుంబ పాలనను అంతం చేసేందుకు కిషన్‌ రెడ్డి నేతృత్వంలో స్థానిక భాజపా బృందం బాధ్యత తీసుకుంటుందని పీయూష్ వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని