బ్రేకింగ్

breaking

దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ: బండి

[18:57]

హైదరాబాద్‌: దేశ ప్రజల పాలిట దేవుడు.. ప్రధాని మోదీ అని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్‌ తిడుతున్నారని మండిపడ్డారు. భాజపా సంకల్ప సభలో సంజయ్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలని దుయ్యబట్టారు. ‘‘ తెలంగాణ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే భాజపా ప్రభుత్వం రావాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భాజపా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. కేంద్రంలో మరో 20 ఏళ్లపాటు భాజపా సర్కారు ఉంటుంది. ప్రధానిపై తెరాస నేతలు విమర్శలు చూస్తే బాధగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని