బ్రేకింగ్

breaking

వచ్చే నెల నుంచి తెలంగాణలో కొత్త కిట్‌: హరీశ్‌రావు

[17:45]

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాత్‌ల్యాబ్స్‌ ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5 ఎంఆర్‌ఐ, 30 సీటీస్కాన్‌ యంత్రాలతోపాటు 1020 అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. యంత్రాలు పాడైతే మరమ్మతుల కోసం కాల్‌సెంటర్‌, ఈ-ఉపకరణ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 9 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ కిట్‌తో 1.50 లక్షల గర్భిణీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి న్యూట్రిషియన్‌ కిట్‌ పంపిణీ చేస్తామని చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు