బ్రేకింగ్

breaking

Bharat Biotech చుక్కల మందు టీకా సక్సెస్‌

[15:35]

దిల్లీ: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ఇంట్రా నాసల్‌ వ్యాక్సిన్‌ ‘బీబీవీ154’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని తెలిపింది. సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వెల్లడించింది.

మరిన్ని

తాజా వార్తలు