బ్రేకింగ్

breaking

ఘోర ప్రమాదం.. 20మంది సజీవ దహనం

[16:17]

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో లాహోర్​ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్​ట్యాంకర్​ ఢీకొన్నాయి. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హాహాకారాలు చేస్తూనే మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం ముల్తాన్‌లో జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని