బ్రేకింగ్

breaking

‘పోలవరం’తో భద్రాచలానికి ముంపు లేదు: కేంద్రం

[16:50]

దిల్లీ: పోలవరం బ్యాక్‌ వాటర్‌పై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్రం వెల్లడించింది. 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరంపై 4 రాష్ట్రాల అధికారులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరం ముంపుపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు అపోహలు ఉన్నాయని తెలిపింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని స్పష్టం చేసింది. పోలవరం పూర్తయ్యాక 3 రాష్ట్రాల్లో మూడోవంతు ముంపు ప్రభావం కూడా ఉండదని పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని