బ్రేకింగ్

breaking

AP: 560 గ్రేడ్‌-2 నియామకాలపై హైకోర్టు స్టే

[17:30]

అమరావతి: రాష్ట్రంలో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2 నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు 38వేల మంది అంగన్‌ వాడీ టీచర్లు పరీక్షలు రాశారు. అయితే, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలక్ట్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నియామకాల ప్రక్రియపై స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణను 4వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని