బ్రేకింగ్

breaking
29 Sep 2022 | 21:15 IST

67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

దిల్లీ: ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతోపాటు పుణె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్లను, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.

మరిన్ని

తాజా వార్తలు