బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 13:57 IST

పీఎఫ్‌ఐ.. వైకాపా రెండూ ఒకటే: సత్యకుమార్‌

అమరావతి: వైకాపాపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపాను నిషేధిత పీఎఫ్‌ఐతో పోల్చారు. ‘‘నిషేధిత పీఎఫ్‌ఐ, వైకాపా రెండూ ఒకటే. రెండిటివీ విధ్వంసకర ఆలోచనలే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్‌కు 51% మాత్రమే మద్దతిస్తున్నారు. వారు సర్వే చేయించిన ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌.. ఈ విషయం వెల్లడించింది. అలాంటిది 175 సీట్లు ఆ పార్టీ ఎలా గెలుస్తుంది? ఇంకా ఎమ్మెల్యేలందరికీ మీటింగ్‌ పెట్టి గడప గడపకు వెళ్లని వారిని హెచ్చరించారు. ముందు జగన్‌.. ఆయన నియోజకవర్గంలో పర్యటించాలి’’ అని సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు