బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 16:35 IST

నేనెలాంటి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: నాగార్జున

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ‘‘విజయవాడ ఎంపీగా నేను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మంచి కథ వస్తే పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తా’’ అని నాగార్జున తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు