బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 18:31 IST

ఆ 4 ప్రాంతాలు రష్యాలో విలీనం.. పుతిన్‌ ప్రకటన

మాస్కో: ఉక్రెయిన్‌లోని స్వతంత్య్ర ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని తెలిపారు. రష్యాలో విలీనమైన ప్రాంతాల్లో జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ఉన్నాయని పేర్కొన్నారు. తమ భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని పుతిన్‌ వెల్లడించారు. అయితే, పుతిన్‌ చేసిన ప్రకటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. ప్రకటన పనికిరానిదని.. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు