బ్రేకింగ్

breaking
30 Sep 2022 | 20:22 IST

గీత దాటితే ₹100.. అడ్డుపడితే ₹1000 జరిమానా!

హైదరాబాద్‌: జంటనగరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలను నిలిపితే రూ.600 జరిమానా విధిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కొత్త నిబంధనలు అక్టోబరు 3 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని