బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 20:43 IST

టీ20 వరల్డ్‌ కప్‌నకు బుమ్రా దూరం

ముంబయి: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌నకు టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కూ దూరం కానున్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై వైద్య నిపుణుల నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా స్థానంలో జట్టులో ఎవరికి చోటు కల్పించనున్నారనే విషయాన్ని బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని