బ్రేకింగ్

breaking

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన

[12:34]

విజయవాడ: రాజధాని అమరావతిపై రోజుకోమాట వైకాపాకు తగదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి.. రాష్ట్ర ప్రజలందరి సంకల్పం, దేవతల ఆశీర్వాదమని ఆయన చెప్పారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ‘‘అన్ని పార్టీల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులతో ఆనాడు రాజధాని ప్రకటించాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాట మార్చారు. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదు. దుష్టశక్తులను తుదముట్టించే శక్తి దుర్గమ్మకు ఉంది’’ అని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్‌ జాతీయ పార్టీపై మీడియా స్పందన అడగ్గా.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని