బ్రేకింగ్

breaking

పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి రెండ్రోజులు

[21:10]

తిరుమల: పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతుంది. తిరుమల వైకుంఠనాథుని దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యాన వనాల్లో నిర్మించిన షెడ్లు నిండిపోవడంతో బాహ్యవలయ రహదారిపై కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో శనివారం ఉదయం వరకు క్యూ లైన్లలోకి భక్తుల అనుమతి నిలిపివేసినట్టు తితిదే అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం క్యూలైన్‌లోకి  ప్రవేశిస్తున్న భక్తులను శనివారం ఉదయం 6గంటలకు రావాలని తిప్పి పంపుతున్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని